Site icon HashtagU Telugu

AP : సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ ఐదేళ్లు..మరోసారి ఆ ఛాన్స్ ఉందా..?

Jagan 5rs

Jagan 5rs

మే 30వ తేదీ 2019న జరిగిన చారిత్రాత్మక ఘట్టం మళ్లీ మరోమారు ఏపీలో రిపీట్ అవుతుందా..? ఖచ్చితంగా అవుతుందని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. ఈసారి వైసీపీ గెలుస్తుందా..? కూటమి గెలుస్తుందా..? అనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి పెంచుతుంది. మే 13 న ఏపీలోని 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ జరిగింది. వీటి ఫలితాలు జూన్ 04 న రాబోతున్నాయి. ఫలితాల సమయం దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంది. అయితే గెలుపు ఫై ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పధకాలు మరోసారి జగన్ ను సీఎం చేస్తాయని పార్టీ శ్రేణులు చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సరిగ్గా ఇదే రోజు 2019లో మే 30వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ రెండవ సీఎంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్టేడియం దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. జగన్ అనే నేను అని అనగానే గ్రౌండ్ మొత్తం బాహుబలి లో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా..ఎలాంటి హర్ష ద్వానాలతో దద్దరిల్లిపోయిందో..జగన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా అలాగే దద్దరిల్లిపోయింది. 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలలో వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు అలాంటి ఫలితాలే వెల్లడి కాబోతున్నాయని..జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 9వ తేదీన మళ్లీ రాష్టం మొత్తం వినిపించేలా, దేశం దృష్టి ఏపీపై నిలిచేలా జగన్ అను నేను అంటూ ఆయన ప్రమాణస్వీకారం జరుగుతుందని భావిస్తున్నారు. మరి వారు భావిస్తున్నట్లు జరుగుతుందా..లేదా అనేది జూన్ 04 న తెలుస్తుంది.

Read Also : Digestive Cancers: ఈ క్యాన్సర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా..!