CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పలు సూచనలు చేశారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి ఈనెల 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్ల పై కలెక్టర్ ఆర్.మహేష్ సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అమలు చేసే ఉపాధి హామీ పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23న గ్రామసభలు నిర్వహించి నిర్ణయించుకున్నారని ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే గ్రామసభలో పాల్గొనడానికి వస్తున్నట్టు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
Read Also: Revanth Vs Ktr: గులాబీ బాస్ సైలెంట్…రేవంత్ టార్గెట్ ఆ ఇద్దరే..!