Site icon HashtagU Telugu

CM Chandrababu : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu's visit to flood affected areas

CM Chandrababu's visit to flood affected areas

Flood Affected Areas: సీఎం చంద్రబాబు యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్‌, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి..బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో.. మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటనను కొనసాగించారు. మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని.. ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగిసిన అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో వేగం పెంచి ప్రజలకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఊహించని విపత్తు నుంచి ప్రజలను త్వరగా కాపాడాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత తమ బాధ్యత అని, బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు. సోమవారం ఉదయం అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.

Read Also: Trainee Doctor : మరో జూనియర్ వైద్యురాలి సూసైడ్.. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి..