CM Chandrababu Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయి, రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 24వ తేదీన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు. అదే రోజున రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా చర్చలు జరపనున్నారు.
ఇక మరోవైపు, నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పంటల దిగుబడులు పెరగడం, పంటల ధరలపై ప్రభావం చూపిన కారణాలను అధికారులు వివరించారు. మిర్చి, పొగాకు, ఆక్వా, చెరకు, కోకో, మామిడి వంటి పంటల ఉత్పత్తుల్లో తగ్గుదల కారణాలపై సీఎం ఆరా తీశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు అవసరమైన చర్యలపై సూచనలు అందించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.