Site icon HashtagU Telugu

Minister Narayana : రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి : మంత్రి నారాయణ

CM Chandrababu's focus on Rushikonda buildings: Minister Narayana

CM Chandrababu's focus on Rushikonda buildings: Minister Narayana

Minister Narayana : విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అక్కడ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇతర దేశాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడా అమలు చేస్తాం. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్‌కు రాలేదు. 2023లో రూ.450 కోట్ల నిధులు వస్తే వాటినీ పక్కదారి పట్టించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్‌ శాఖకు ఇచ్చారు. వచ్చే నెల నాటికి టీడీఆర్‌ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది. సెప్టెంబర్‌ 13న మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా. నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టాం అని నారాయణ తెలిపారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.

Read Also: Reliance AGM : ముకేశ్ అంబానీ వైపు 35 లక్షల మంది చూపు.. 29నే రిలయన్స్ ఏజీఎం