Srikakulam district : రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం లో ఉచిత సిలిండర్ డెలివరీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, విజయవాడ వెళతారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాగా.. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ డెలివరీ కార్యక్రమం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా..
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.35 గంటలకు విజయవాడ నుంచి విమా నంలో బయలుదేరుతారు. 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి 12.40 గంటలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాప్రతినిఽ దులతో మాట్లాడతారు. 1.05 గంటలకు ఈదు పురంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి స్థితిగతు లను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. 1.50 గంటలకు ఈదుపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు భోజన విరామం. అక్కడ నుంచి హెలీక్యాఫ్టర్‌లో బయలుదేరి 3.45 గంటలకు శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. మరుసటి రోజు శనివారం ఉదయం 8.35 గంటలకు హెలీకాఫ్టర్‌లో బయలుదేరి విజయనగరం జిల్లా వెళ్తారు.