CM Chandrababu Visits Flooded Areas: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలేరు పై డిప్యూటీ సీఎంతో కలిసి ఆయన సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, కొత్త బట్టలు, కొత్త ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. నష్టపోయిన వారికి కొత్త ఇళ్లు కట్టి ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. మా వాళ్ళు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయరు..ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తారు అని (కార్లు హారన్ కొడుతున్నారని) అలా పేర్కొన్నారు. వరద బాధితులను ఎంత వరకు ఆదుకుగలమో అంత వరకు ఆదుకుంటాము. ఏలేరు కి 47 వేలు క్యూసెక్కులు నీరు ఒక్క సారి గా వచ్చాయి.
Read Also: BJP vs Congress : బీజేపీ నేతల పెండింగ్ కేసులపై కర్ణాటక ప్రభుత్వం ఫోకస్
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ ఇబ్బందులు వచ్చాయి ,ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదు అన్నారు. ఏలేరు కాలువ ఆధునికీకరణ బాధ్యత ఏన్డీఏ ప్రభుత్వానిది అన్నారు సీఎం చంద్రబాబు. దాదాపు 65 వేలు హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు.
కాగా, కృష్ణా నదికి, బుడమేరు వాగుకు వరదల మూలంగా ప్రధానంగా విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. గడిచిన వారం రోజులుగా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆ తరువాత గోదావరి నది, కొల్లేరు ప్రాంతం, అదే విధంగా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉత్తరాంధ్ర భారీ వర్షాలు, ముంపు ముప్పులో ఉన్నాయి.
Read Also: Hydra : హైడ్రాకు మరో కీలక బాధ్యత..!