Site icon HashtagU Telugu

CM Chandrababu : అచ్యుతాపురం బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ..గాయపడిన వారికి రూ.50లక్షలు

Cm Chandrababu Visits Achyu

CM Chandrababu visits Achyutapuram victims

CM Chandrababu: అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయాపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరికి ఏం కాదని, ధైర్యంగా ఉండాలని బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. వారికి అందిస్తున్న వైద్య చికిత్సపైనా ఆరా తీశారు.

We’re now on WhatsApp. Click to Join.

బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకూ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తమ వారికి ఎలాంటి ప్రమాదం జరగదని, త్వరలోనే కోలుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Manda Krishna Madiga : సీఎం రేవంత్‌తో మందకృష్ణ మాదిగ భేటీ.. సీఎం ట్వీట్

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో జరిగిన ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy Chief Minister Pawan Kalyan)స్పందించారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ చేయమని చెబుతూనే ఉన్నానని ఆయన తెలిపారు. ఈవిషయంలో కంపెనీ యాజమాన్యాలు భయపడుతున్నాయని, వాళ్లకు వివరించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ గురించి సెప్టెంబర్‌లో చర్చించాలనుకున్నాం. కానీ, ఈ నెల చివరలోనే ఈ విషయంపై కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాను” అని పవన్ అన్నారు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు మూతపడతాయోమోనని యజమానులు ఆందోళన చెందుతున్నారని, దీని గురించి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ”ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. వీరి మధ్యన విభేదాలు ఉండటంతో సేఫ్టీ ఆడిట్ చేయించలేదు” అని పవన్ తెలిపారు.

Read Also: MLC kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత