ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు. అలాగే జలాశయ మరమ్మతు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, నారాయణ పాల్గొంటారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం సత్యవేడు శ్రీసిటిలో సీఎం పర్యటిస్తారు. కొన్ని పరిశ్రమలకు భూమిపూజ, మరి కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయం 11:40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం శ్రీసిటీకి వెళ్లనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో సీఎం ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also : Rape in India : ఇండియా లో గంటకు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలుసా..?
