Site icon HashtagU Telugu

Chandrababu: పోలవరం పనులను పర్యవేక్షించిన చంద్రబాబు

Babu Polavaram

Babu Polavaram

సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం (Polavaram ) ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్న ఆయన..చెప్పినట్లు ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు చేరుకున్న చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు.

అనంతరం చంద్రబాబు.. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్‌ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూడడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. 3 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శన చేశారు.

ఇక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తెలిపారు. ‘బిల్లులు సమర్పించిన వెంటనే కేంద్రం నిధుల్ని విడుదల చేస్తోంది. పోయినసారి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత ప్రభుత్వ హయాంలో పనులు అంగుళం కూడా కదల్లేదు. అమరావతికి నిర్మాణానికీ పూర్తి సహకారం ఉంటుంది’ అని ఆమె స్పష్టం చేశారు.

Read Also : Glass Bridge : ఇది చైనాలో కాదు.. మన ఇండియాలోదే..!