CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరుతున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రవాణై, ఉదయం 10.40కి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు వెళ్లి, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తారు.
అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడి ఏర్పాట్లను సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12.05కి నోవాటెల్ హోటల్‌కు వెళ్లి, అధికారులతో యోగా వేడుకలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కి నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరి, 2.50కి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. యోగా వేడుకలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధానాలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథి, ఇతర ఉత్తరాంధ్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదివారమే విశాఖ చేరుకున్నారు.
Pakistan : ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం పాకిస్తాన్‌ను భయబ్రాంతులకు గురిచేస్తోందా..?