Site icon HashtagU Telugu

Veeraiah Chowdary : వీరయ్య చౌదరి శరీరంపై కత్తిపోట్లు చూసి చంద్రబాబు కన్నీరు

Cbn Veeraiah Chowdary

Cbn Veeraiah Chowdary

టీడీపీ మాజీ ఎంపీపీ, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి (Veeraiah Chowdary) దారుణ హత్య (Murder) రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బయలుదేరి ప్రత్యక్షంగా గ్రామానికి చేరుకున్న చంద్రబాబు, వీరయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ముసుగులు ధరించిన దుండగులు వారి ఆఫీసులోనే కత్తులతో దాడి చేసి 53 చోట్ల అతి కిరాతకంగా పొడిచారు. హత్య చేసిన తీరు చంద్రబాబును కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతుందని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.

Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీలో ఉన్నపుడే ఈ దారుణ సంఘటన విషయం తెలిసిందని, వెంటనే ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడని, పార్టీ కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో 100 రోజులు పాల్గొన్న వీరయ్య, అమరావతి రైతుల పాదయాత్రకు కూడా మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. నాగులుప్పలపాడు మండలంలో 10 వేల ఓట్ల మెజారిటీ తెచ్చే స్థాయికి ఎదిగిన నేతను ఇలా నిష్ఠూరంగా హతమార్చాడని ఖండిస్తున్నా. భిన్నాభిప్రాయాలు ఉంటే చర్చించాలి కానీ హత్యలు చేయడం రాక్షసత్వమన్నారు.

ఈ కేసును ఛేదించేందుకు ఇప్పటికే 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. హత్య సమయంలో ఆఫీసులో ఉన్న ఇతరులను కూడా బెదిరించిన నిందితులు ఎవరో గుర్తుపట్టకుండా ముసుగులు ధరించి దాడి చేసినట్లు వెల్లడించారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.