Anna Canteens : అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Chandrababu Started Anna

CM Chandrababu started Anna canteen

Anna Canteens: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రంలో అన్న కాంటీన్లను ప్రారంభించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన గుడివాడలో సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్‌ను మరోసారి ప్రారంభించారు.అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ప్రజలకు వడ్డించారు. ఆ తర్వాత ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు కుటుంబ సమేతంగా భోజనం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు సైతం టోకేన్‌ తీసుకుని మరీ భోజన చేస్తూనే ప్రజలతో మాట్లాడారు. భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అయితే విశాఖలో మాత్రం అన్న క్యాంటీన్ల ప్రారంభాన్ని వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5 లకే ఆహారాన్ని అందిస్తారు.

కాగా, ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుండి పూటకు రూ.5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మిగత క్యాంటీన్లు శుక్రవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు.

శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసివేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ వాటిని పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అన్నింటినీ ఒకేసారి సెప్టెంబర్‌లో పునః ప్రారంభిచాలని అనుకున్నారు. అయితే కొన్ని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయినందుకు ఇప్పుడు వంద వరకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగతావి వచ్చే నెలలో ప్రారంభిస్తారు.

Read Also: Solar Rooftop : ఆంధ్రాలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లు

 

 

 

 

  Last Updated: 15 Aug 2024, 01:50 PM IST