Site icon HashtagU Telugu

CM Chandrababu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష..

CM Chandrababu review summer plan

CM Chandrababu review summer plan

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో వేసవి ప్రణాళికపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి కారణంగా నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్‌, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు ఏంటి.. ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధానాలు ఏంటి? అనే దానిపై చర్చించారు. హీట్ వేవ్ సమాచారాన్ని ప్రజలకు రియల్ టైంలో షేర్ చేయడం ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Read Also: Nabha Natesh : పొట్టి పొట్టి దుస్తులతో నభా నటేష్ హాట్ షో

2014-19 నాటికి మాదిరిగా, ఈసారి కూడా ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎండలకు గురికాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యతో పాటు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని గుర్తించిన సీఎం, ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కాగా, మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలో భానుడు భగభగమంటుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. ఇక ఈసారి గత వేసవి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక, ప్రస్తుతం అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్రస్థాయిలో పంట నష్టం అయినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Read Also: Araku Coffee Stall : ఇది మన గిరిజన రైతులకు గర్వకారణం: సీఎం చంద్రబాబు