Laddu Quality: తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపారనే ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిని, లడ్డూలు తీసుకునే వారి సంఖ్య తగ్గిందని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. తాజాగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత (Laddu Quality) పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వసతుల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి. భక్తి భావాం ఉండాలి. వాళ్లలో కూడా బాధ్యత మనం గుర్తుచేసే పరిస్థితి రావాలి. అందుకే అవ్వన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది. ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ప్రసాదాల్లో మార్పు వచ్చింది. మేనేజ్‌మెంట్‌లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్పూర్తి దాయకమైన ప్రదేశం. ఈ స్పూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్పూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడతామని ఆయన అన్నారు.
Also Read: Revanth Cheating : దేవుళ్లను కూడా మోసం చేసిన చిట్టి నాయుడు – కేటీఆర్
తిరుమలలో లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు – సీఎం @ncbn pic.twitter.com/Ec7UvSePcY
— greatandhra (@greatandhranews) October 5, 2024
ఇకపోతే లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏర్పాటు చేయాల్సిన అవరసం ఉందని కోర్టు తెలిపింది. అంతేకాకుండా రాజకీయ నాయకులెవరూ లడ్డూ వివాదం గురించి మాట్లాడవద్దని కోర్టు హెచ్చరించింది. మొత్తం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదికను ఇవ్వాలని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలి జంతువుల కొవ్వు వాడిందని సీఎం చంద్రబాబు రెండు వారాల క్రితం మాట్లాడిన విషయం తెలిసిందే.