Praja Vedika In Vadlamanu : హామీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం – సీఎం చంద్రబాబు

Praja Vedika In Vadlamanu : హామీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని స్పష్టం చేస్తూ, అర్హులైన 206 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే మళ్లీ ఓటుకు రానంటూ

Published By: HashtagU Telugu Desk
Cm Chandrababu Praja Vedika

Cm Chandrababu Praja Vedika

ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమాను(Vadlamanu )లో నిర్వహించిన ప్రజా వేదిక(Praja Vedika)లో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నాయుడు బీసీ వర్గాలతో ముఖాముఖి అయి ప్రజల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. హామీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని స్పష్టం చేస్తూ, అర్హులైన 206 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే మళ్లీ ఓటుకు రానంటూ ప్రజల ముందు ఆవిశ్వాసాన్ని ప్రదర్శించారు. పీ-4 పథకం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలకు కొత్త ఆశ చూపుతున్నామని తెలిపారు.

బీసీల అభివృద్ధే టీడీపీ లక్ష్యం

బీసీ వర్గాల పట్ల టీడీపీకి గల నిబద్ధతను గుర్తు చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాల ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. బీసీలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఫారిన్ లో చదువుకునే బీసీ విద్యార్థులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. సివిల్స్, గ్రూప్స్ వంటి ఉన్నత ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అమరావతిలో ప్రత్యేక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వం బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి కూడా సమానంగా కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇల్లు కట్టుకునే వర్గాలకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు, అలాగే ఎస్సీల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నామని తెలిపారు. సంపన్నులు పేదల కోసం ముందుకు రావడం వల్ల సమాజంలో సమతుల్యత సాధ్యమవుతుందని, అందుకే పీ-4 కార్యక్రమం ద్వారా సామాజిక సౌభ్రాతృత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

  Last Updated: 11 Apr 2025, 04:44 PM IST