నందమూరి తారకరామారావు (NTR) ఈ పేరు చెపితే దేవుడే అని అంత అంటారు. చిత్రసీమలోనే కాదు రాజకీయ రంగంలో కూడా తనదైన మార్క్ కనపరిచాడు. రాజకీయాలను ఇలా కూడా చేయొచ్చని నిరూపించిన ప్రజా నేత. అలాంటి జన నేత 29 వ వర్ధంతి (NTR 29th Anniversary) ఈరోజు. ఈ సందర్బంగా ప్రతి తెలుగు వారు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు (Chandrababu) కడపలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొని ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలు, స్ఫూర్తి, ప్రజల పట్ల ఆయన ప్రేమ గురించి మాట్లాడారు.
Kohli- Rahul: రంజీ ట్రోఫీకి దూరంగా కోహ్లీ, రాహుల్.. బీసీసీఐకి ఏం చెప్పారంటే?
“ఎన్టీఆర్ అనే వ్యక్తి నాయకుడిగా మాత్రమే కాదు, ప్రజాసేవకుడిగా తెలుగు జాతి గుండెల్లో చెరగని గుర్తుగా నిలిచారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని నిరూపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్” అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ జీవితం ఒక సందేశమని, పేదవారికి పక్కా ఇళ్ల కల నెరవేర్చిన మొదటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని, పేదవాడి కళ్లలో వెలుగులు నింపేలా ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన సేవల వల్ల తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
తెలుగు జాతి భాషా గౌరవాన్ని పెంచేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిదని, తెలుగు సంస్కృతి, పరంపరలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కిందని చంద్రబాబు అన్నారు. “ఎన్టీఆర్ నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయన చూపిన దారిలో నడుస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.