CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీల‌క‌ ప్రకటన

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు.

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu

CM Chandrababu

  • ఎన్ని కాన్పులకు అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు
  • గతంలో రెండు కాన్పుల వరకు ప్రసూతి సెలవులు
  • మార్కాపురం ఉమెన్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

CM Chandrababu: జనాభా సమతుల్యత గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశం వృద్దాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే.. యువశక్తి తో భారత్ ముందుకు వెళ్లాలంటే కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని సిఎం చెపుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లల్ని కనకపోవడం వల్ల, మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో ఎదురుతున్న సమస్యలను ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు.

Also Read: IND vs NZ: భార‌త్‌- న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు. పిల్లల్ని కని పెంచే విధానాలను ప్రోత్సహించాలని ఈ రోజు మరో కీలక నిర్ణయం ప్రకటించారు.

సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇస్తుంది. ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన ఈ సెలవులు వారికి ఉంటాయి. అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెపుతున్న ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహించేందుకు ఇకపై ఎంత మంది పిల్లల్ని కన్నా.. అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ఇది అమల్లోకి వస్తే.. ఎన్ని కాన్పులు జరిగినా అన్నింటికీ ఆ ఉద్యోగినికి ప్రసూతి సెలవులు లభిస్తాయి. ఉమెన్స్ డే రోజు సిఎం వారికి ఉపయోగకరమైన నిర్ణయాన్ని వారి కోరిక మేరకు ప్రకటించారు.

  Last Updated: 08 Mar 2025, 08:00 PM IST