ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం (Deepam Scheme) అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM CHandrababu) సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అనేక సమస్యలు ఉన్నాయని, లబ్ధిదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సిలిండర్ ఉచితంగా అందాల్సినప్పటికీ, డెలివరీ సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 48 గంటలలోపు డబ్బు ఖాతాలో జమ కావడం లేదని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, సాంకేతిక సమస్యలను తొలగించి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
Gruhalakshmi Scheme : ‘గృహలక్ష్మి’ స్కీమ్ కు నిధుల కొరత
ఇక ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి బస్సులో QR కోడ్ ఏర్పాటు చేసి, ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వాటిని మెరుగుపరిచే చర్యలు తక్షణమే తీసుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులు తీసుకురావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి, జిల్లాల వారీగా ర్యాంకులు కేటాయించనున్నట్లు తెలిపారు. వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
Sunday: ఆదివారం రోజు మాంసాహారం తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
అలాగే రేషన్ సరుకుల పంపిణీపై కూడా చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని, దీని వెనుక ఉన్న అవినీతిని ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరే విధానంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ప్రజలే మొదటి ప్రాధాన్యతగా భావించి పాలన సాగించాలని చెప్పారు. గ్రామాల్లో 5,859 చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరు గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, వాటిని వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా కనిపించాలంటే విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాలి అని చంద్రబాబు అధికారులకు సూచించారు.