Site icon HashtagU Telugu

World Economic Forum : గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపు

CM Chandrababu Naidu attends CII Conference on Green Industrialization in Davos

CM Chandrababu Naidu attends CII Conference on Green Industrialization in Davos

World Economic Forum : స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్  కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలతో భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఐటీ పరిశ్రమలు వచ్చాక హైదరాబాద్‌కు వేగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ను పలు రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల అగ్ర నగరాల సరసన చేర్చాం. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం. రెండంకెల అభివృద్ధి సాధిస్తేనే కోరుకున్న మార్పు సాధ్యం. ఇక్కడ మిమ్మల్ని చూశాక నమ్మకం పెరిగింది. భవిష్యత్‌లో నా కలలు కచ్చితంగా నెరవేరతాయని నమ్మకం పెరిగిందని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువ. కారణం ఏంటంటే గత 20 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, సంస్కరణలే కారణం. ఏఐ, రియల్ టైమ్ డేటా, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఎన్నో టెక్నాలజీ రంగాల్లో ప్రముఖులను ఒక దగ్గరికి చేర్చితే వీటిపై ఎన్నో అవకాశాలు పెరుగుతాయి. నిత్యజీవితంలో టెక్నాలజీ వాడకం పెరిగింది. నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తో గ్లోబల్ కమ్యూనిటీకి ఎంతో మేలు జరుగుతుంది. దేశాన్ని డిజిటలైజేషన్ చేయాలని ప్రధాని మోడీ నా తరహాలోనే ఆలోచిస్తున్నారు.

పీ4 పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా అద్బుతాలు చేయవచ్చు. పేదరిక నిర్మూలన కోసం శ్రమిద్దాం. రాష్ట్రంలో అవకాశాలు మెరుగు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఐడియాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చేసేందుకు ముందుకు రావాలని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు. భారతీయులు అధికంగా కష్టపడతారు. ఐఎస్‌బీ లాంటివి ప్రపంచ స్థాయి నేతల్ని తయారుచేయాలన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉన్నది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు అన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే, ఇదో పెద్ద లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటారు. కానీ, చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు తెలిసిన మా లాంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమి కాదు. హైదరాబాద్ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం నాడు చంద్రబాబు గారి విజన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.

Read Also: India Jersey: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. పీసీబీకి షాకిచ్చిన బీసీసీఐ!