Site icon HashtagU Telugu

CM Chandrababu: తిరుమల చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు…

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఏపీ రాష్ట్రాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండు రోజుల తొలి పర్యటన నిమిత్తం తిరుమలకు విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ ఉన్నారు.

అంతకుముందు తిరుమలలోని గాయత్రీ నిలయం విశ్రాంతి గృహానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో దూసి నరసింహ కిషోర్‌ స్వాగతం పలికారు. ఇతర అధికారులతోపాటు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ ఆరోగ్య, విద్యాశాఖ జేఈవో గౌతమి తదితరులు పాల్గొన్నారు. కాగా జూన్ 13న సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read: Satyakumar : తొలిసారిగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకి కేబినెట్ బెర్త్..!