Site icon HashtagU Telugu

Delhi : కేంద్ర మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ

CM Chandrababu meeting with Union Ministers

CM Chandrababu meeting with Union Ministers

Delhi: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీల నేత సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లి.. చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది. అంత‌కుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద పూల మాల‌ వేసి చంద్ర‌బాబు నివాళులర్పించారు.

బుధవారం ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు భేటి అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతోపాటు అమిత్ షా అధ్యక్షతన వహించారు. అలాగే ప్రతిపక్షాల ఆందోళనలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు తీరుతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. భారత మాజీ ప్రధాని, భరతరత్న అటల్ బిహారి వాజపేయ్ శత జయంతి జన్మదినం కావడంతో బీజేపీ ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్డీయే నేతల సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగింది.

Read Also: Daggubati Purandeswari : బాబాసాహెబ్ అంబేడ్కర్‌ బీజేపీకి స్ఫూర్తిదాయకం