Site icon HashtagU Telugu

CM Chandrababu : ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu meet PM Modi

CM Chandrababu meet PM Modi

Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వీరి మధ్య దాదాపుగా గంట పాటు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిధులతో పాటు ఇతర అంశాలుపై చర్చలు జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ అధ్యాత్మిక కేంద్రం అయిన తిరుపతిలో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూనూ కల్తీ చేసిన వైనంపై ఓ నివేదిను మోడీకి చంద్రబాబు సమర్పించినట్లుగా సమాచారం.

Read Also: HYDRA : ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా యాప్‌ : ఏవీ రంగనాథ్

హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చంద్రబాబునాయుడు అత్యంత ముఖ్యమైన పార్టనర్. బీజేపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీ టీడీపీ. ఈ కారణంగా జాతీయ రాజకీయాల్లో రాబోతున్న మార్పులు..  అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినటలుగా తెలుస్తోంది.

రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా, చంద్రబాబునాయుడు మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతున్నారు. ఈ మధ్యలో అశ్విని వైష్ణువ్ , నిర్మలాసీతారామన్ వంటి కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి రాష్ట్రానిక రావాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రితో ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read Also: Pawan Kalyan : మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్