Free gas cylinder scheme : ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఆపై స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం చంద్రబాబు పాలు, టీ పొడి, పంచదార వేసి టీ చేశారు. టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు.
టీ మరిగిస్తూనే శాంతమ్మతో మాట్లాడి సీఎం చంద్రబాబు… కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ మరిగిన తర్వాత ఆయనే వడపోసి అందరికీ ఇచ్చారు. ఈ టీ బిల్లు చెల్లించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌తో చమత్కరించారు. ఆయనకు కూడా అదే స్పీడ్‌తో… ఏ నిధుల నుంచి చెల్లించాలంటూ రిప్లై ఇచ్చారు. నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదన్నారు. తర్వాత మంత్రులతో కలిసి టీ తాగారు. ‘సీఎం చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా, అంతకు ముందు కట్టెలపొయ్యి పెట్టి వండుకునే వాళ్లం. చాలా ఇబ్బందులు ఎదుర్కున్నామని తమ సమస్యను చంద్రబాబుకి వివరించింది. అలాగే మీరే స్వయంగా మా ఇంటికి వస్తారని అస్సలు అనుకోలేదని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.