TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు

CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే […]

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu is touring Uttarandhra districts

CM Chandrababu is touring Uttarandhra districts

CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చంద్రబాబు(chandrababu) అన్నారు. వైసీపీ(YCP) పాలనతో రాష్ట్రం పూర్తిగా దివాల తీసిందని..డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు. టీడీపీ హయాంలోనే పోలవరం 72 శాతం పూర్తి అయింది.

Read Also: CM Chandrababu : కుప్పం నుంచే కౌంటర్ గేమ్ స్టార్ట్ చేసిన బాబు.!

గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. పోలవరం ఎప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకూ నీరందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.800 కోట్లు ఖర్చవుతుంది. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేస్తాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావొచ్చు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి. ఈ జిల్లాకు సాగునీరందిస్తే నా జన్మ సార్థకం అవుతుందన్నారు.

Read Also: Anushka : అనుష్క కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఎవరు..?

కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖ(Visakha)ను దోచుకున్నారు. ప్రజల భూములన్నీ కొటేయాలనుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేసున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకు వెళ్తుంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయాలి. దాంతో రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తాం. అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలను పడకేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీయే కూటమి కర్తవ్యం. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఖండించాలని చంద్రబాబు అన్నారు.

Read Also: Dream: గంగా నదిలో స్నానం చేసినట్టు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

 

 

 

 

  Last Updated: 11 Jul 2024, 02:37 PM IST