ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం , సీఎంగా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యముగా అమరావతి (Amaravathi) ప్రజలు , రైతుల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి. ఆనాడు చంద్రబాబు ఒక్క పిలుపుతో అమరావతి రాజదాని కోసం తమకున్న భూములు వదులుకున్నారు. చంద్రబాబు చెప్పినట్లే అమరావతి రాజధాని అయ్యింది..భారీ నిర్మాణాలు , అభివృద్ధి జరిగింది. కానీ ఆ తర్వాత జగన్ వచ్చి అమరావతిని కాస్త అడవిని చేసాడు. రాజధాని అమరావతి కాదంటూ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం అంటూ ఐదేళ్ల పాటు అమరావతి పక్కకు వెళ్ళలేదు..దీంతో అక్కడి రైతులు , ప్రజలు ఐదేళ్లుగా పోరాటం సాగిస్తూ వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు. అంతే కాదు ఆయన వెళ్లే రాజధాని గ్రామాల్లో ఇళ్ల ముందు పరదాలు పెట్టి ఫోర్స్ ను నిలబెట్టేవారు. అలా చేసిన తర్వాత ఆయన కాన్వాయ్ ఆ దారి గుండా కనీసం ఎనబై కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోయేది..అటు చూసి ఇటు చూసేలోపే జగన్ మాయం అయ్యేవాడు..ఆలా ఐదేళ్ల పాటు పరదాలు చాటునే పాలనా సాగించారు. ఒక్క అమరావతి లోనే కాదు రాష్ట్రంలో ఏ పల్లె కు వెళ్లాలన్న కానీ పరదాలు కట్టుకునే వెళ్లే వారు. అలాంటి సీఎం జగన్. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది..పరదాలు మాయం అయ్యాయి.
అలాగే అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. మొన్నటి వరకు అడవిని తలపించిన అమరావతి..ఇప్పుడు ఓ పెద్ద నగరంలా కనిపిస్తూ జిగెల్ అంటుంది. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ఇదిలా ఉంటె రేపు సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
రాజధాని నిర్మాణాలు, శంకు స్ధాపన జరిగిన ప్రాంతాన్ని సీఎం సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లు , రాజధాని ప్రాంతంలోని వివిధ నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు , అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also : Kharif Season Crops : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం