Site icon HashtagU Telugu

Chandrababu : జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్

Babu Jc

Babu Jc

ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు (Chandrababu).. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adhinarayanareddy, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు వ్యవహారంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి .. జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఈ వివాదం ప్రతిష్టగా మారింది. ఇద్దరు నేతల మద్దతు దారులు తమ మాట నెగ్గించుకొనేందుకు పంతం పట్టారు. దీంతో, ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు వెనక్కు తగ్గకపోవటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు.

దీంతో ఈ వివాదం పైన సీఎం చంద్రబాబు స్పందించారు.జేసీ, ఆదినారాయణ రెడ్డి తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. శాంతి భద్రత ల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని..ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఆర్టీపీపీలోని ఉచిత బూడిద కోసం జమ్మలమడుగు, తాడిపత్రికి చెందిన కూటమి నేతలు తమ ఆధిపత్యం కోసం రోడ్డెక్కటం కూటమిలో చర్చగా మారింది. అధికారంలో ఉన్న రెండు పార్టీల నేతలు ఇలా వ్యవహరిస్తే నష్టపోతామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Also : Rich Habits : ధనవంతులుగా ఎదగాలంటే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..