Site icon HashtagU Telugu

CM Chandrababu : విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurated five electricity substation

CM Chandrababu inaugurated five electricity substation

Electricity sub-stations : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తాళ్లాయపాలెంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం పరిసరాలను సీఎం పరిశీలించారు. అంతేకాక..రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 విద్యుత్‌ ప్రాజెక్టులకు, ,14 సబ్ స్టేషన్ల సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో భవిష్యత్తులో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా తాళ్లాయపాలెం లో రాష్ట్రంలోనే మొదటి GIS విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు . రాజధాని లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఈ ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్‌గ్రేడ్‌ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్‌ నుంచి సరఫరా తీసుకుంటారు. వీటి ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది.

తాడికొండ విద్యుత్తు కేంద్రానికి ఇవి ప్రత్యామ్నాయం కానున్నాయి. అటు తాడికొండ, ఇటు తాళ్లాయపాలెం 220/33కేవీ విద్యుత్తు కేంద్రాల నుంచి రాజధాని ప్రాంతానికి విద్యుతు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు తోడ్పడుతుంది. తాళ్లాయపాలెం జీఐఎస్‌ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు సరఫరా చేస్తారు.

Read Also: Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?