Site icon HashtagU Telugu

CM CBN : నేడు సీఎం హోదాలో గౌరవ సభకు నారా చంద్రబాబు నాయుడు

Ap Assembly Sessions

Ap Assembly Sessions

నేడు సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తాను అని 2021 నవంబర్ 19న సభలో చంద్రబాబు నాయుడు శపథం చేశారు. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో సభనుంచి అవేదనతో చంద్ర‌బాబు బయటకు వెళ్లారు. నాటి చంద్రబాబు అవేదన, కన్నీటిని కూడా వైసీపీ నేతలు, అప్పటి సీఎం జగన్ హేళ‌న చేశారు. ఇది శాసన సభ కాదు….ఇది కౌరవ సభ…తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ నాడు బయటకు చంద్రబాబు బ‌య‌టికి వెళ్లిపోయారు. 2021 నవంబర్ 19 తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టని చంద్రబాబు .. 4 సారి ముఖ్యమంత్రిగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 163(+1) మంది కూటమి సభ్యుల మధ్య సభలోకి చంద్ర‌బాబు నాయుడు అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌ట‌పాలెంలోని ఎన్టీఆర్ విగ్ర‌హానికి చంద్ర‌బాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళ్లు అర్పించారు. అనంత‌రం శాస‌న‌స‌భ‌కు వెళ్ల‌నున్నారు. శాస‌న‌స‌భ మెయిన్ గేట్ వ‌ద్ద కూడా చంద్ర‌బాబుకు స్వాగ‌త ఏర్పాట్లు చేశారు. త‌న శ‌ప‌థం నేర‌వేరినందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం జ‌ర‌గ‌నుంది.