ఏపీలో కూటమి (CBN GOVT) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజలు వరుస శుభవార్తలు వింటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని ఎన్నో హామీలు , పనులు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. మొన్నటి వరకు గుంతల రోడ్లను కాస్త ఇప్పుడు తారురోడ్లుగా మారుస్తూ ప్రజలను అనారోగ్యం బారినపడకుండా బయటపడేస్తున్నారు. ఇదే క్రమంలో పలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ లు అందిస్తూ వారి కుటుంబంలో ఆనందం నింపుతున్నారు.
తాజాగా రాష్ట్రంలో 108, 104 సేవలను (108, 104 services) మరింత పటిష్టం చేయడంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ వ్యవస్థను తీసుకురావాలని సూచిస్తూ, 108 అంబులెన్స్ సేవలకు మరింత గణనీయమైన మార్పులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సీఎం సూచనల ప్రకారం, 108 సేవల కోసం 190 కొత్త అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల అత్యవసర వైద్యసేవలు మరింత సత్వరంగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే మహాప్రస్థానం సేవలను మరింత విస్తరించేందుకు 58 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా నిర్ణయించారు.
అంతే కాదు 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4,000 చొప్పున వేతనాలు ఇవ్వాలని సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషాన్ని కలిగించడమే కాకుండా, వారి సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది. కార్మికుల శ్రమకు విలువనిచ్చే ఈ నిర్ణయం సామాజిక సేవా రంగానికి గొప్ప దిశగా చెప్పవచ్చు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించేందుకు ప్రతి మండలంలో మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకే మెడికల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయం వైద్య సేవల రంగంలో విప్లవాత్మకమైన మార్పుగా భావించబడుతోంది.
Read Also : Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్‌రావు