Site icon HashtagU Telugu

Ramprasad Reddy Wife : మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై సీఎం బాబు ఆగ్రహం

Babu Fire Minster Wide

Babu Fire Minster Wide

పోలీసులపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy Wife) భార్య (Haritha Reddy) తిట్ల పురాణంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని… ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

సోమవారం ఉమ్మడి కడప జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. రాయచోటి నియోజకవర్గంలో తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి కూడా ఎస్కార్ట్‌గా ఎందుకు రాలేదని
రోడ్ పై పోలీసులను నిలదీశారు. డ్యూటీ కూడా సరిగా చేయడం రాదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఎలాంటి పదవిలో లేని ఆమె అధికారులతో మాట్లాడిన తీరుపై యావత్ ప్రజానీకం విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడం తో మంత్రికి ఫోన్ చేసి హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా మసలుకోవాలని.. ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అయితే, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

Read Also : CBN : కలుద్దాం అంటూ.. సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..