Site icon HashtagU Telugu

Davos : మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ

CM Chandrababu and Lokesh meet with Mittal Group Chairman

CM Chandrababu and Lokesh meet with Mittal Group Chairman

Davos : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటన కొనసాగుతుంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు టీమ్ మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మిమిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్రో కెమికల్, గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్న ఉన్నాయని వివరించారు. వీటికి భావనపాడు కేరాఫ్‌గా మారనుందని మ్యాపింగ్‌తో సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఆరునెలల కిందట కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయని వివరించారు.

భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు మిత్తల్ గ్రూపును ఆహ్వానించారు. భావనపాడు పెట్రోకెమికల్స్ అన్వేషణకు అనువైన ప్రాంతామన్నారు. అలాగే రాష్ట్రంలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని కూడా కోరారు. రూ.3,500 కోట్లతో హెచ్‌పీసీఎల్‌-మిత్తల్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.

ఏపీ ప్రతిపాదన పట్ల మిట్టల్ సానుకూలంగా స్పందించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో లక్ష్మీమిట్టల్, ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపి ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. కాగా, అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఆర్సెలార్ మిత్తల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని లక్ష్మీమిత్తల్‌ గుర్తు చేశారు. ఆర్సెలార్‌ మిత్తల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్ అనకాపల్లిలో ఏర్పాటు చేసేది అతిపెద్ద ప్రాజెక్టు అన్నారు. ఇది అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

Read Also: Woman DNA Mystery : వైద్యురాలి డెడ్‌బాడీపై మహిళ డీఎన్ఏ.. ఎలా ? ఎక్కడిది ?