Site icon HashtagU Telugu

Class 3 Students Detained: చిన్నారుల‌కు `మేన‌మామ` జ‌గ‌న్‌ సంకెళ్లు

students detained

students detained

ఏసీ సీఎం జ‌గ‌న్ జ‌మానాలో పోలీసుల ఓవ‌రాక్ష‌న్ హ‌ద్దులు దాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన‌ర్లు చించేశార‌ని అనుమానిస్తూ పాఠ‌శాల‌ల పిల్ల‌ల్ని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ కోసం 3,4 త‌ర‌గ‌తులు చ‌దువులోన్న విద్యార్థుల‌ను పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌డం చోద్యం. అంతేకాదు, సాయంత్రం వ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ లోనే వాళ్ల‌ను కూర్చొబెట్ట‌డం జ‌గ‌న్ స‌ర్కార్ అరాచ‌కాలకు ఇదో ప‌రాకాష్ట‌. .

వివరాల్లోకి వెళితే, ప‌ల్నాడు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జాన‌పాడు గ్రామంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన‌ర్ల‌ను క‌ట్టింది. వాటిని ఎవ‌రో ధ్వ‌సం చేశారు. ఆ మేర‌కు పోలీస్ స్టేష‌న్లో ఆ పార్టీకి చెందిన లీడ‌ర్లు ఫిర్యాదు చేశారు. పోస్ట‌ర్ల‌ను అదే గ్రామానికి చెందిన 3,4 త‌ర‌గ‌తులు చ‌దువున్న విద్యార్థులుగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు అనుమానించారు. దీంతో పోలీసులు స్కూల్ పిల్ల‌ల్ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లోని నేల‌పై 3, 4 తరగతుల విద్యార్థులను గంటల తరబడి కూర్చోబెట్టారు. ఈ సంఘ‌ట‌న‌పై సత్తెనపల్లి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జయరామ్ ప్రసాద్ మాట్లాడుతూ, “విచారణ కోసం, విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్‌కు పిలిపించామ‌ని చెప్పారు. వైఎస్సార్‌సీపీ వేసిన పోస్టర్లను ధ్వంసం చేశారనే ఆరోపణలు వాళ్ల‌పై ఉన్నాయ‌ని చెప్ప‌డం విడ్డూరం.

అధికార వైఎస్‌ఆర్‌ వర్గీయుల ఫిర్యాదు మేరకు జానపాడు గ్రామానికి చెందిన చిన్నారులను పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్స్ బ్యానర్లను చిన్నారులు చించివేశారని అనుమానిస్తూ పిల్లలను ఒకరోజు పాటు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి, ఆ తర్వాత విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులను పోలీసు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధికార వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై మండిపడ్డారు. విద్యార్థులను రోజంతా కస్టడీకి తరలించిన వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.బాలల హక్కులకు భంగం కలిగిస్తూ అమాయక పిల్లలను పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.