పొత్తుల వల్ల మేలు ఎంత జరుగుతుందో కానీ దాడులు మాత్రం రోజు రోజుకు ఎక్కవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే..మాకు కాదని వేరే పార్టీ అభ్యర్ధికి టికెట్ ఎలా ఇస్తారంటూ జనసేన – టిడిపి (Janasena – TDP) లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram ) విషయానికి వస్తే..పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయం ప్రకటించిన వెంటనే స్థానిక టిడిపి నేత వర్మ..అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
వర్మ (Varma) అనుచరులు రోడ్ పైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. టీడీపీ వర్మను మోసం చేసిందని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెడుతూ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. వర్మకు టికెట్ ఇవ్వాలని లేకుంటే.. టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అనుచరులు అల్టిమేటం ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించటంతో పవన్ కు మద్దతు తెలిపేందుకు వర్మ ఒప్పుకున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం పని చేస్తానని వర్మ ప్రకటించినప్పటికీ స్థానికంగా ఇరు పార్టీ శ్రేణుల మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు. స్థానిక నేత వర్మను కాదని పిఠాపురం సీటు జనసేనకు కేటాయించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చేది లేదని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక జనసేన క్యాడర్ టీడీపీ క్యాడర్ పై దాడికి దిగుతున్నారని వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పల్లకి మోసినంత మాత్రాన ఇలా దాడులు చేస్తే చేతులు కట్టుకు కూర్చోమని హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే..పవన్ కళ్యాణ్ ను అక్కడ టీడీపీ శ్రేణులే ఓడించిన ఆశ్చర్య పోనవసరం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని చాల తప్పు చేసారని జనసేన నేతల ఆవేదన.
పిఠాపురంలో టీడీపీ అసమ్మతి తీవ్రత చూశాక పవన్ కల్యాణ్ గెలుపు కష్టమేనని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి వ్యత్తిరేకంగా టీడీపీ నేతలు పరోక్ష నిరసనలు తెలియజేయడంపై జనసేన కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం తమ నాయకుడు ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వ్యక్తి పోటీ చేస్తానంటే.. ఇంతలా నిరసనలు తెలియజేస్తారా అంటూ జనసైనికులు మండిపడుతున్నారు.
Read Also : IPL 2024: ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ విధ్వంసం