TDP vs YSRCP : మాచ‌ర్ల‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ, వైసీపీ నేత‌ల కొట్లాట

మాచ‌ర్లలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాచ‌ర్ల టీడీపీ

  • Written By:
  • Publish Date - December 17, 2022 / 07:41 AM IST

మాచ‌ర్లలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాచ‌ర్ల టీడీపీ ఇంఛార్జ్ జూల‌కంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్ల‌డంతో అక్క‌డ వైసీపీ నేత‌లు అడ్డుకున్నారు. ఇటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఎదురుదాడికి దిగారు. ఇరువ‌ర్గాలు కొట్టుకోవ‌డంతో ప‌రిస్థితి చేయిదాటిపోయింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అటు వైసీపీ నేత‌లు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన కార్ల‌కు నిప్పు పెట్టారు. టీడీపీ కార్యాల‌యంని కూడా త‌గ‌ల‌బెట్టారు. ఘర్షణల అనంతరం గుమిగూడిన జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘర్షణల్లో తమ పార్టీ కార్యాలయానికి, నేతల వాహనాలకు నష్టం వాటిల్లడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్‌ను ధ్వంసం చేసిన సమయంలో అక్కడ ఉన్నారని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. పార్టీ నేతల కార్లను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ టీడీపీ మద్దతుదారులకు చెందిన దుకాణాలను కూడా తగులబెట్టారని ఆరోపించారు.

స్థానిక పోలీసులు మౌనంగా ఉండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని టీడీపీ నేత‌లు ఆరోపించారు. కాగా ఈ ఘటనను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు, పోలీసుల వ‌ఈమద్దతుతో టీడీపీ శ్రేణులపై వైఎస్సార్‌సీపీ దాడులు చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహాయంతో దాడి చేయడం దారుణమ‌ని.. . ఇదేం ఖర్మ రాష‌ష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీపై వైసీపీ రౌడీలు దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని లోకేష్ అన్నారు. టీడీపీ కార్యకర్తల కార్లను తగులబెట్టి, వారిపై దాడి చేసిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని, వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు గుంటూరు డీఐజీతో ఫోన్‌లో మాట్లాడారు. మాచర్లలో పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ఆయ‌న ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.