Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?

పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.

Chandrababu: పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు. అప్పటివరకు ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఆసక్తికరంగా స్పందించారు బాబు. అయితే దీనికి ముందు ఢిల్లీలో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ రానుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వైసీపీతో పోరుకు సిద్దమవుతుంది.

చంద్రబాబు తన పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..జనసేన, భాజపా పొత్తు పెట్టుకుంటాయని తేల్చేశారు. కావున టిక్కెట్ ఆశించేవారు త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. భాజపా, జనసేన పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది తేలాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని చంద్రబాబే అన్నారు.

ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందనుకుందాం. పొత్తులు, సీట్ల వ్యవహారం ఈ నెలాఖరులోగా తేల్చొచ్చని చంద్రబాబు చెబుతున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటనకు మరో రెండు వారాల గడువు అవసరం. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓ వైపు అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతుండగా మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.ఎందుకంటే మూడు పార్టీలు పొత్తు నేపథ్యంలో నేతల మధ్య సంధి కుదరడం లేదు.

ఏ విధంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు, సీట్లు, అభ్యర్థుల ప్రకటన సాఫీగా సాగడం లేదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేయడంతో అభ్యర్థుల ప్రకటన తిరస్కరణకు గురవుతోంది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా పూర్తి స్థాయి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే ఎన్నిక‌ల నాటికి చిన్న‌పాటి అసంతృప్తులను కూల్ చేయొచ్చన్న యోచనతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే అలాంటి పరిస్థితి ఈ మూడు పార్టీల్లో కనిపించడం లేదు.

పొత్తులను ఖరారు చేసేందుకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సీట్లు, అభ్యర్థుల ప్రకటన అంటే ఎన్నికలు కూడా అయిపోతాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2009 లాగే పొత్తులు టీడీపీని ముంచెత్తబోతున్నాయన్న ఆందోళన పార్టీలో నెలకొంది.

Also Read: Mahbubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం..21 వీధికుక్కల కల్చివేత