సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జస్టిస్ రమణకు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపం లో వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్ , టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు .
CJI NV Ramana: శ్రీవారి సేవలో సుప్రీం చీఫ్
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Nv Ramana
Last Updated: 19 Aug 2022, 02:51 PM IST