Site icon HashtagU Telugu

Heavy Traffic: పట్నం బాట పడుతున్న జనం.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!

Traffic

Traffic

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా , కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన రహదారులే కాకుండా.. ఇతర మార్గాల్లోనూ వాహనాల రద్దీ కనిపిస్తోంది!

విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు వస్తున్నాయి. దీంతో అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి.. హైదరాబాద్‌ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసింది. కాగా.. అటు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులను పెంచేసింది కేసీఆర్‌ సర్కార్‌. జనవరి 16 వ తేదీతో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయంతో.. జనవరి 30 వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.