ఏపీలో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసు విచారణలో కొత్త మలుపు తెరపైకి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నమోదైన ఈ స్కాంలో సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. అయితే ఈ విచారణలో ఓ కానిస్టేబుల్‌ను అన్యాయంగా వేధించినట్టు ఆరోపణలు రావడం సంచలనం రేవుతుంది. గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ అనే కానిస్టేబుల్ ఈ ఆరోపణలు చేశాడు.
Bigger Indus Plan : సింధు జలాల వినియోగానికి కాల్వల తవ్వకం!
మదన్ అనే కానిస్టేబుల్ డీజీపీ హరీష్ గుప్తాకు రాసిన లేఖ ప్రకారం.. సిట్ విచారణలో భాగంగా తనను విచారించిన అధికారులు తీవ్రంగా వేధించారని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తనను శారీరకంగా దాడి చేసి, గాయాలయ్యేలా చేశారని ఆ లేఖలో ఆరోపించాడు. గాయాల ఫోటోలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆధారాలతో పాటు డీజీపీకి నివేదించాడని సమాచారం. ఈ లేఖ ప్రస్తుతం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
Phone Tapping Case : కేసీఆర్ ను ఏపీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుందా…?
ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ దర్యాప్తు పద్ధతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు, రాజకీయ ప్రతీకారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక కానిస్టేబుల్‌ని ఫోర్స్ చేసి వాంగ్మూలం తీసుకోవడమంటే న్యాయపరంగా తగదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డీజీపీ స్పందనతో పాటు, ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో వాస్తవాలకన్నా రాజకీయ లక్ష్యాలే ముందున్నాయా అనే సందేహాలు గట్టిగా వినిపిస్తున్నాయి.