Ramgopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. 2019లో ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’సినిమాపై ఒంగోలు , అనకాపల్లి , మంగళగిరి లో నమోదైన కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులలో విచారణకు హాజరు కావాలని ఈరోజు మరోసారి గుంటూరు సీఐడీ అధికారులు రాంగోపాల్ వర్మకు నోటీసులు జరీ చేశారు. రామ్ గోపాల్ వర్మ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు.
Read Also: Kohli ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నయా ర్యాంక్‌లో విరాట్ కోహ్లీ!
రామ్ గోపాల్ వర్మపై తాజాగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని ఆర్జీవీపై కేసు నమోదు అవగా ఒంగోలులో విచారణను హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సీఐడీ అధికారుల నోటీసుల నేపథ్యంలో విచారణకు మినహాయియింపు కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించాడు.
కాగా, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిటే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్ కు చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. సినిమాలో అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని, వాటిని తొలగించలేదని, కొన్ని వర్గాలకు బాధ కలిగిస్తున్నారని వంశీ కృష్ణ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, సీఐడీ పోలీసులు గత ఏడాది నవంబర్ 29న మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీని తర్వాత, సీఐడీ అధికారులు వర్మకు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Read Also: Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు