Site icon HashtagU Telugu

AP : సిట్ ఆఫీస్ లో చంద్రబాబుకు సంబదించిన కీలక పత్రాలను తగలబెట్టిన సీఐడీ అధికారులు

Cbn Papers

Cbn Papers

తాడేపల్లి సిట్‌ ఆఫీస్ ఆవరణలో పెద్దమొత్తంలో హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో పాటు చంద్రబాబు ఫై అక్రమంగా పెట్టిన పలు కేసులకు సంబదించిన పత్రాలను తగలబెట్టారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. సీఐడీ(CID) చీఫ్‌ రఘురామ్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా ఈ పత్రాలను తీసుకొచ్చి.. తగలబెట్టారని అంటున్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు పెట్టిందని, వాటినిన్నంటిని ఇప్పుడు సీట్ అధికారులు తగలబెట్టారని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటి రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్‌ను దొడ్డి దారిన సంపాదించారని గతంలో లోకేశ్​ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేశ్​ను సీఐడీ ప్రశ్నించింది. కేసుతో సంబంధంలేని వారి వ్యక్తిగత పత్రాలు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేశ్ నిలదీశారని..ఇప్పుడు ఆ పత్రాలు లేకుండా చేసేందుకు ఇలా జగన్ కుట్ర చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాదించబోతుందని తెలుస్తుండడం తో..అక్రమ కేసులకు సంబదించిన పత్రాలు తగలబెట్టించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

Read Also : liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు