CID : రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుని విచారిస్తున్న సీఐడీ

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబును సీఐడీ అధికారులు క‌స్ట‌డీలోకి

  • Written By:
  • Updated On - September 23, 2023 / 11:17 AM IST

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబును సీఐడీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. రెండు రోజులు క‌స్ట‌డీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. న్యాయ‌వాదుల స‌మ‌క్షంలో చంద్ర‌బాబుని విచారించాల‌ని కోర్టు డైరెక్ష‌న్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఉద‌యం 9 గంట‌ల‌కు తొమ్మిది మంది సీఐడీ అధికారులు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు చేరుకున్నారు. జైల్‌లోని సెంట్ర‌ల్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో చంద్ర‌బాబుని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. విచార‌ణ మొత్తం వీడియో తీయాల‌ని కోర్టు ఆదేశించింది.దీంతో అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. గంట గంట‌కు ఐదు నిమిషాల విరామం ఇవ్వాల‌ని కోర్టు తెలిపింది. ఒంటి గంట నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు భోజ‌న విరామం ఇవ్వాల‌ని ఏసీబీ కోర్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఉద‌యం విచార‌ణ ప్రారంభంకు ముందు వైద్య ప‌రీక్ష‌లు.. విచార‌ణ పూర్తి అయిన త‌రువాత వైద్య ప‌రీక్ష‌లు చేయాల‌ని కోర్టు సూచించింది. చంద్ర‌బాబు త‌రుపున గింజుప‌ల్లి సుబ్బారావు, ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ ఇద్ద‌రు న్యాయ‌వాదుల‌ను కోర్టు అనుమ‌తించింది. ఇటు చంద్ర‌బాబు క‌స్ట‌డీ నేప‌థ్యంలో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ వ‌ద్ద పోలీసులు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. జైలు ప‌రిస‌రాల్లో రెండంచెల భ‌ద్ర‌త‌ను పోలీసులు ఏర్పాటు చేశారు.