రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Inner Ring Road case) విషయంలో ఏపీ CID ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే చంద్రబాబు , ఆయన కుమారుడు లోకేష్ , మాజీ మంత్రి నారాయణలను ఈ కేసులో చేర్చగా..తాజాగా మరో నలుగుర్ని ఈ కేసులో చేర్చి వారికీ షాక్ ఇచ్చింది.
మాజీ మంత్రి నారాయణ (Narayana Wife) సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ 120 బీ, 409, 420, 34,35, 37, 166, 167 రెడ్ విత్ 13 (2) పీఓసీ చట్టంలోని 13 (1) (సీ) (డీ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ పిటీషన్ ను సీఐడీ విజయవాడ ACB కోర్టు లో దాఖలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు. కాగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అటు హైకోర్టు తీర్పును వెలువరించిందో లేదో.. ఇటు సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొందరి పేర్లను యాడ్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
Read Also : Election Code In Telangana: డిజిటల్ మీడియా ఫై బిఆర్ఎస్ కన్ను