CID DG Press Meet: చంద్రబాబు అరెస్ట్ పై ఉ.10 గంటలకు సీఐడీ డీజీ ప్రెస్‌మీట్.. స్కీం పేరుతో స్కామ్ చేశారన్న సజ్జల..!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10గంటలకు ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ (CID DG Press Meet) నిర్వహించనున్నారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 09:06 AM IST

CID DG Press Meet: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10గంటలకు ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ (CID DG Press Meet) నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించనున్నారు. ఇప్పటికే బాబుపై ఐపీసీ సెక్షన్లు 166, 167,418, 420 కింద కేసులు పెట్టారు. సెక్షన్లు 465,468, 479, 409,201 ఆయన మీద పెట్టారు. చంద్రబాబుని నంద్యాల నుంచి విజయవాడ అధికారులు తరలించనున్నారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ని టీడీపీ నేతలే కాకుండా ఇతర రాజకీయ పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వైసీపీ పాలనకు పరాకాష్ట అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ పాలనకు అద్దం పడుతోందన్నారు.

Also Read: Non-Bailable Cases: చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు: బాబు లాయర్లు

మరోవైపు అధికార పార్టీ మాత్రం ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు చెప్తుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఆధారాలతోనే చంద్రబాబుని సిట్ అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. స్కీం పేరుతో స్కాం చేశారని ఆరోపించారు.