Site icon HashtagU Telugu

Chandrababu CID Interrogation : చంద్రబాబు పై CID ప్రశ్నల వర్షం..ఆ 15 కీలకం

cid questions to chandrababu

cid questions to chandrababu

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)కు ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగానే శుక్రవారం ఏసీబీ కోర్ట్ (ACB Court)..రెండు రోజులు సీఐడీ కస్టడీ (CID Custody)కి అప్పజెపుతూ ఇచ్చిన తీర్పు టీడీపీ శ్రేణులను మరింత షాక్ కు గురి చేసింది. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు ను సీఐడీ ఎలా విచారణ చేస్తుందో..? ఏ ఏ ప్రశ్నలు వేస్తుందో..? వాటికీ బాబు ఏ సమాదానాలు చెపుతాడో అనే ఉత్కంఠ నెలకొంది ఉంది.

ఉదయం నుండి చంద్రబాబు (Chandrababu) ను CID అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తునట్లు తెలుస్తుంది. ఉదయం 9.30 గంటలకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారుల బృందం.. జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబును విచారిస్తున్నారు. మొత్తం 120 ప్రశ్నలను చంద్రబాబును అడగబోతుంది. అందులో 15 ప్రశ్నలు అత్యంత కీలకం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవాదుల సమక్షంలో తమ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన 15 ప్రశ్నలకు చంద్రబాబు (Chandrababu) సమాధానం చెపుతారా..లేదా నేడు ఆసక్తిగా మారింది.

ఆ 15 ప్రశ్నలు ఏంటి అంటే..!

1. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మీ పాత్ర ఏంటి?

2. కేబినెట్‌ ఆమోదం లేకుండా నిధుల్ని ఎందుకు విడుదల చేశారు?

3. జీవోకు, ఒప్పందానికి ఎందుకు తేడా ఉంది?

4. 13 చోట్ల ఉన్న సంతకం మీదేనా?

5. షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనుక మీ పాత్ర ఏంటి?

6. మీ పీఏ ఎందుకు పరారీలో ఉన్నాడు?

7. 2018లో ఐటీ మీకు లేఖ రాస్తే ఎందుకు దాచారు?

8. నోట్‌ ఫైల్స్‌ ఎలా మాయమయ్యాయి ?

9. అధికారులు అభ్యంతరం చెప్పినా నిధులెలా ఇచ్చారు?

10. రూ.241 కోట్ల నిధులను ఏం చేశారు?

11. గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణ కంపెనీలకు నిధులు మళ్లాయా..?

12. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు ఎవరికి చేరాయి..?

13. సబ్‌ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?

14. లోకేష్‌, ఆయన ఫ్రెండ్‌ కిలారు రాజేష్‌ పాత్ర ఏంటి?

15. నిధుల కోసం ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా ?

మరి వీటికి చంద్రబాబు సమాదానాలు చెపుతాడా..? దాటవేస్తాడా..? ఈ కేసులో ఇంకేం ప్రశ్నలు వేస్తారు..? లోకేష్ ను సైతం అరెస్ట్ చేసి ఈ ప్రశ్నలు అడుగుతారా..? అనేది చూడాలి.

Also Read: AP : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతి సీరియస్