Site icon HashtagU Telugu

Chodavaram Hostel Students : చోడవరం వసతి గృహాల్లో మద్యం సేవిస్తూ..విద్యార్థులు హల్చల్

Chodavaram Hostel Students

Chodavaram Hostel Students

న్యూ ఇయర్ (New Year) సందర్బంగా అనకాపల్లి జిల్లా చోడవరం (Chodavaram Hostel Students ) వసతి గృహాల్లో 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు మద్యం సేవిస్తూ ( Liquor Party ) ఉన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ సందర్బంగా హాస్టల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో విద్యార్థులు బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. వీరంతా చోడవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 10 తరగతి చదువుతున్నారు. హాస్టల్ గోడదూకి బయటకు వెళ్లిన విద్యార్థులు బయటి నుంచి వచ్చిన యువకులతో కలిసి సమీపంలో ఓ అపార్ట్‌మెంటు వద్ద మందు పార్టీ చేసుకున్నారు. విద్యార్థుల అల్లరికి బయటకు వచ్చిన స్థానికులు ఈ తతంగాన్ని వీడియో తీశాడు.

We’re now on WhatsApp. Click to Join.

మద్యం మత్తులో ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడికి దిగారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ చిన్నయ్య స్పందించారు. 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ తాను హాస్టల్‌లోనే ఉన్నానని ఆ తర్వాత ఇంటికి వెళ్లానన్నారు. తాను హాస్టల్‌ నుంచి వెళ్లిన తరువాత విద్యార్థులు ఇలా చేసి ఉండవచ్చన్నారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఇలా మందు పార్టీ చేసుకోవడం కలకలం రేపుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న విద్యార్థులు ఇలా చెడు వ్యసనాలకు అలవాటుపడడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. విద్యార్థి దశలోనే ఇలా చెడు అలవాట్ల వైపు దారిమళ్లడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Read Also : Mohammed Siraj Unleashed : బంతులా…బుల్లెట్లా…కేప్ టౌన్ రాజ్ సిరాజ్