Ticket Price Issue : టాలీవుడ్ లో 10న రచ్చ

తెలుగు సినిమా వ్యవహారం మళ్ళీ రచ్చ కెక్కుతోంది. మా అధ్యక్షుడు విష్ణు సంక్రాంతి సందర్భంగా జగన్ , చిరు భేటీని పూర్తిగా వ్యక్తిగతం అని సంచలన కామెంట్ చేసిన వెంటనే చిరంజీవి సీన్లోకి వచ్చాడు. ఈ నెల 10న మళ్ళీ చిరంజీవి అండ్ టీం ఏపీ సిఎం జగన్ తో భేటీ కానుంది.

  • Written By:
  • Updated On - February 8, 2022 / 04:07 PM IST

తెలుగు సినిమా వ్యవహారం మళ్ళీ రచ్చ కెక్కుతోంది. మా అధ్యక్షుడు విష్ణు సంక్రాంతి సందర్భంగా జగన్ , చిరు భేటీని పూర్తిగా వ్యక్తిగతం అని సంచలన కామెంట్ చేసిన వెంటనే చిరంజీవి సీన్లోకి వచ్చాడు. ఈ నెల 10న మళ్ళీ చిరంజీవి అండ్ టీం ఏపీ సిఎం జగన్ తో భేటీ కానుంది. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని నెలల తరువాత చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, రాజమౌళి టీంగా వెళ్లి కలిశారు. కేవలం శుభాకాంక్షలు తెలపడానికి మాత్రమే కలిశామని ఆనాడు చెప్పారు. కానీ, ఆ రోజే ఆన్లైన్ , టికెట్ ధరల నియంత్రణ గురించి చర్చ జరిగింది. ఆ విషయాన్ని మంత్రి పేర్ని నాని వెల్లడించిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో భూములు పంచుకోవడానికి జగన్ ను కలిశారని హీరో బాలకృష్ణ ఆరోపించారు. దీంతో కొంత కాలం ఆ భేటీ మీద చర్చ జరిగింది. బాలయ్య చేసిన కామెంట్స్ మీద మెగా ఫామిలీ నటులు, హీరోలు సోషల్ మీడియాలో ఎటాక్ చేశారు. అభిమానులు కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పరస్పరం మెగా , నందమూరి కోణంలో రచ్చ చేశారు. ఆ తరువాత ఆన్లైన్ , టికెట్ ధరల నియంత్రణ బిల్లు వచ్చింది. దానిపై జనసేనని సీరియస్ గా స్పందించాడు. కేవలం ఆయన్ను ఒక్కడినే దృష్టిలో పెట్టుకొని జీవో తెచ్చారని ఫోకస్ చేసాడు. తీరా, చిరు అండ్ టీం జగన్ ను కలిసినప్పుడు ఇచ్చిన నివేదికను బయట పెట్టిన తరువాత మౌనంగా ఉండిపోయాడు.

ఉచితంగా సినిమాలని ఏపీలో ఆడిస్తాను అని ప్రగల్బాలు పలికాడు. సీన్ కట్ చేస్తే , సినిమాల విడుదల ను వాయిదా వేసుకున్నాడు. కొంత కాలం ఈ వివాదానికి దూరంగా ఉన్నాడు. వర్మ, దిల్రాజు, నట్టి కుమార్ తదితరులు మంత్రి పేర్ని నాని తో కలిశారు. ఆ లోపు కొందరు కోర్ట్ కి వెళ్లడంతో థియేటర్ ల మూసివేత నడిచింది. దాంతో టాలీవుడ్ కు జరుగుతున్న నష్టాన్ని గమనించి చిరంజీవి వెళ్లి జగన్ ను కలిశాడా? అంటే ఏ మాత్రం కాదు. ఎందుకంటే, జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్ళాడు. ఆ విషయాన్ని భేటీ తరువాత చిరు చెప్పాడు. ప్రతేక విమానంలో హైద్రాబాద్ నుంచి సంక్రాంతి విందుకు జగన్ ఆహ్వానం మేరకు వెళ్ళాడు. విందు చాలా బాగుందని, జగన్ సతీమణి చాలా ఆప్యాయంగా వడ్డించిందని చెప్పాడు. ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఆ భేటీ పూర్తిగా వ్యక్తిగతమని అర్ధం అవుతుంది. అదే విషయాన్ని మంచి విష్ణు మరోసారి అందరికి అర్థం అయ్యేలా చెప్పాడు.

వ్యక్తిగత మీటింగ్ అయినప్పటికీ టికెట్ ధరల గురించి ఆనాడు చిరంజీవి మాట్లాడాడు. రెండు వారాల్లో మంచి నిర్ణయం ఏపీ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పాడు. కానీ , అక్కడ నుంచి ఆలస్యం అవుతుంది. పైగా సొంత రాజకీయాల కోసం చిరు కలిశాడని ప్రచారం జరుగుతోంది. విష్ణు తాజాగా చేసిన కామెంట్ తో ఆ ప్రచారానికి బలం దొరికింది. అలాంటి ప్రచారం, అపవాదులకు చెక్ పెట్టడానికి ఈ నెల 10న ఒక టీం తో వెళ్లి జగన్ ను కలవాలని ప్లాన్ చిరు ప్లాన్ చేస్తున్నాడు. ఆ రోజున హైకోర్టు ఆదేశం మేరకు వేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశం ఉంది. అదే జరిగితే చిరు మీద వచ్చిన అనుమానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. లేదంటే , గతంలో బాలయ్య చేసిన కామెంట్స్ మరోసారి వినిపిస్తాయి. మళ్ళీ రచ్చ అయ్యే అవకాశం లేకపోలేదు.