Site icon HashtagU Telugu

Election Results : తమ్ముడికి..అన్నయ్య మెగా విషెష్

Pawan Chiruwiesh

Pawan Chiruwiesh

ఏపీ లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి ఈరోజు భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను అభినందించారు అన్నయ్య చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

‘డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే చంద్రబాబు కు సైతం చిరంజీవి బెస్ట్ విషెష్ అందించారు.

ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !

ఇక పిఠాపురం బరిలో నిలుచున్న పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే.

Read Also :