Site icon HashtagU Telugu

Chiranjeevi : తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiru Tweet Nagababu

Chiru Tweet Nagababu

జనసేన నేత కొణిదెల నాగబాబు (Nagababu) ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ(MLC)గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలియజేశారు. “శాసన మండలిలో తొలిసారి అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలపై గళం విప్పి, వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ, మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Janasena: రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్‌ : నాగబాబు

ఇప్పటికే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమైన సమయంలో, నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనితో పాటు ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లేదా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ చివరకు ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Janasena Formation Day : జనసేన ప్రస్థానంపై చంద్రబాబు ట్వీట్

నాగబాబు రాజకీయ ప్రస్థానానికి ఇది ఒక కొత్త మలుపు. జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికను ఆనందంగా స్వాగతించారు. నాగబాబు ప్రజా సమస్యలపై వేదికపై నిరంతరం మాట్లాడే నేతగా పేరొందారు. ఆయనను కేబినెట్‌లో భాగస్వామ్యం చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతుండగా, ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా జనసేన పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై శాసన మండలిలో ప్రజా సమస్యల కోసం ఆయన ఎంతగా కృషి చేస్తారో చూడాలి.