Site icon HashtagU Telugu

Chiranjeevi: నేను పిఠాపురం రావడం లేదు: చిరు సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ కేక్ గా పరిగణించబడుతుంది. కారణం అక్కడ జనసేన అధినేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే. అయితే పవన్ ని ఓడించేందుకు అధికార వైసీపీ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అక్కడ మహిళా అయిన వంగ గీతను పవన్ పై పోటీకి ఆదేశించారు. గీత సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో అక్కడ ఆమెకు బలమైన క్యాడర్ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ సారి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి లక్ష మెజారిటీ ఖాయమంటూ జనసేన ప్రచారం చేస్తుంది. మరోవైపు సినీ సెలబ్రిటీలు పిఠాపురంలో ప్రచారం చేస్తుండటంతో ఈ ప్రాంతంపై అందరి దృష్టి పడింది.

పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతునిస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై జనసేన ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు నాకు వ్యతిరేకంగా చిరంజీవి ప్రచారం చేయడని వంగ గీత ఇదివరకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను పిఠాపురంలో ప్రచారంలో చేయడంలేదని, తాను పిఠాపురానికి వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇది అవాస్తవమని మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ తో గౌరవించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో చిరంజీవి భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మెగాస్టార్ మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించారు. పద్మవిభూషణ్ పురస్కారం నా అభిమానులది, ఏ సమయానికి ఏది రావాలో అవే వస్తాయి, ఆశపడితే అవార్డులు రావు అంటూ మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న రావాలనుకోవడం సముచితం, ఎంజీఆర్ కు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కు రావాలి, ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని నేను కోరుకుంటున్నా అని తన అభిప్రాయాన్ని తెలిపారు చిరు.

పిఠాపురంలో ప్రచారంపై చిరు స్పందించారు. పిఠాపురానికి నేను రావాలని కళ్యాణ్ ఎప్పుడు కోరుకోడని చెప్పారు. పవన్ కళ్యాణ్ నన్ను కంఫర్డ్ గా ఉంచాలనుకుంటాడు. రేపు పిఠాపురం వెళ్లడం లేదు, బయట జరిగే ప్రచారమంతా అవాస్తవమని కుండబద్దలు కొట్టారు చిరంజీవి. అయితే తన వెంటే నేను ఉంటానని మాత్రం స్పష్టం చేశారు. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను. అయితే కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలన్నారు. ఇక చివరిలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అన్న ప్రశ్నకు టాటా చెబుతూ వెళ్లిపోయారు.

Also Read: Koppula: వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేయొద్దు : కొప్పుల